మహబూబ్ నగర్: మహిళలతో కలిసి స్టెప్పులేసిన ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తాలో ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాలమూరు ఎంపీ డీకే అరుణ ముఖ్యఅతిథిగా పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక బంజారా మహిళలు, యువతులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నేతలు, ఆయా మండలాల బీజేపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி