మహబూబ్ నగర్: గురుకుల పాఠశాలలో బస చేసిన జిల్లా కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతి బాఫూలే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాలను బుధవారం రాత్రి కలెక్టర్ విజయేంద్ర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ నెలకొన్న సమస్యలపై విద్యార్థులతో చర్చించి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ రాత్రి భోజనం చేసిన కలెక్టర్ అక్కడే బస చేశారు. ఇక నుంచి తనిఖీలను ముమ్మరం చేస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி