కోయిల్ సాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత

మహబూబ్ నగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు బుధవారం సాయంత్రం కోయిల్ సాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదిలినట్లు తెలిపారు. ఎగువన ఉన్న మద్దూరు, దౌల్తాబాద్ మండలాల నుంచి వరద ఉధృతి మరింత పెరిగితే ఇతర గేట్లను ఎత్తే అవకాశం ఉందని సూచించారు. బండర్ పల్లి వాగుకు వరద కొనసాగుతుంది.

தொடர்புடைய செய்தி