కోయిల్ సాగర్ ఒక గేటు ద్వారా నీటి విడుదల

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి శనివారం ఒక గేటు ద్వార నీటిని దిగువకు విడుదల చేశారు. పెద్దవాగు ఉధృతి తగ్గడంతో ప్రస్తుతం ఒక గేటును ఒక అడుగు మేర తెరిచి నాలుగు వందల క్యూసెక్కుల నీటిని వాగులోకి వదులుతున్నారు. పెద్దవాగు ప్రవాహం పెరిగితే ఎక్కువ గేట్లు తెరుస్తామని అధికారులు తెలిపారు. కాగా కోయిల్ సాగర్ పరవళ్లను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

தொடர்புடைய செய்தி