ప్రస్తుతం నకిలీ పేమెంట్ యాప్ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయి. కొనుగోలుదారుల మొబైల్ స్క్రీన్లను మాత్రమే కాకుండా, వ్యాపారులు తమ బ్యాంక్ ఖాతా మర్చంట్ యాప్ నోటిఫికేషన్లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. నకిలీ సక్సెస్ఫుల్ పేమెంట్ స్క్రీన్షాట్లను చూపించి చిన్న వ్యాపారులను మోసం చేస్తున్నారు. డబ్బులు జమ అయ్యాయో లేదో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. పేమెంట్ జరిగినప్పుడు బ్యాంక్, యూపీఐ యాప్ నుంచి అధికారిక SMS వస్తుంది. స్మార్ట్ స్పీకర్ల వంటి వాయిస్ అలర్ట్ డివైజ్లను వాడటం ద్వారా మోసాలను నివారించవచ్చు.