బల్లి పడ్డ చట్నీ తిని నలుగురికి అస్వస్థత (వీడియో)

జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని అహ్మద్ టిఫిన్ సెంటర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చట్నీలో బల్లి పడటంతో అది తిన్న నలుగురు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంబంధిత అధికారులు టిఫిన్ సెంటర్‌పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

தொடர்புடைய செய்தி