దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ దీపావళి నాటికి ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి భోపాల్, అహ్మదాబాద్, పాట్నా మార్గాల్లో రైళ్లు నడుస్తాయి. తొలిసారిగా స్లీపర్ కోచ్‌లతో రాత్రిపూట ప్రయాణం మరింత సౌకర్యంగా ఉండనుంది. ఢిల్లీ-పాట్నా రూట్‌లో ప్రయాణ సమయం 13-17 గంటల నుంచి కేవలం 11.30 గంటలకు తగ్గనుంది. ఈ రైలు గరిష్టంగా గంటకు 180 కి.మీ వేగంతో నడపడం ద్వారా సుదూర ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గిస్తుంది.