అగ్నిప్రమాదం.. క్షణాల్లో కాలిపోయిన రెస్టారెంట్

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ శివారులో, సోమవారం మధ్యాహ్నం 161వ జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ ఫ్యామిలీ రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెస్టారెంట్ పక్కన చెత్తను తగులబెట్టగా, గాలి తీవ్రతకు నిప్పురవ్వలు ఎగిరి పడటంతో మంటలు వ్యాపించి రెస్టారెంట్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕