TG: శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రధాన రహదారిపై వెళ్తున్న టాటా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపి బయటకు పరుగులు తీశాడు. నిమిషాల వ్యవధిలోనే కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.