TG: హైదరాబాద్‌లోని చార్మినార్ పరిధిలో ఉన్న మదీనా క్రాస్‌రోడ్డులోని బాంబే హౌస్ అనే వస్త్ర దుకాణంలో సోమవారం ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణం, గోదాము నుండి మంటలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, చార్మినార్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్ ఇంజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.