ఝార్ఖండ్‌లోని గఢ్వాలోఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బాణసంచా దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొంతమందికి గాయాలు కాగా.. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.