గాజాలో మూడేళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 74,475 మంది మరణించగా, 1,75,517 మంది గాయపడినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ దాడులు కొనసాగుతున్నాయని పేర్కొంది. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 1,517 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 5,400 మంది గాయపడినట్లు తెలిపింది.