ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

TG: హైదరాబాద్‌ శివారులోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి జిల్లా కొల్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ సమీపంలో డివైడర్‌ మధ్యలోని చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్‌ ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన అశోక్‌ లేలాండ్‌ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందగా, చెట్లకు నీళ్లు పోస్తున్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పఠాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕