ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగి వృద్ధురాలు మృతి(వీడియో)

తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలోని తెప్పకుళం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక వృద్ధ మహిళ ఆర్టీసీ బస్సు ఎక్కింది. కీళవాసల్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు, ఆమె బస్సు దిగింది. వెంటనే తాను దిగిన బస్సు ముందు రోడ్డు దాటడానికి ప్రయత్నించగా బస్సు డ్రైవర్ పట్టించుకోకుండా వృద్ధురాలిని ఢీకొట్టాడు. ఈ క్రమంలో బస్సు చక్రాల కింద నలిగి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி