అసోంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రత నమోదు

అసోంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌లో దీని తీవ్రతగా 4.2గా నమోదైంది. బ్రహ్మపుత్ర ఉత్తర ఒడ్డున ఉన్న ఉదల్‌గురి జిల్లాలో ఆదివారం ఉదయం 7:47 గంటలకు భూప్రకంపణలు చోటుచేసుకున్నాయి. 15 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదిక పేర్కొంది. కాగా, ప్రకంపనలు రావడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఇళ్లనుంచి బయటకు వచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி