తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలపై ‘ఈగిల్ ఫోర్స్’ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అక్టోబర్ 29న అందిన సమాచారంతో హెచ్‌సీయూలో సోదాలు నిర్వహించి, గంజాయి వాడుతున్న భరద్వాజ్, ఆనంద్ అనే విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి సమాచారంతో నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు బికాష్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. హెచ్‌సీయూ, నల్సార్, గీతం వర్సిటీలకు చెందిన 24 మంది విద్యార్థుల పాత్రపై దర్యాప్తు సాగుతోంది. వీరికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.