టీమిండియా యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ భారత పేసర్ మోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అఫ్గానిస్థాన్తో జరిగిన సిరీస్లో నితీష్ రాణించడంతో అతడిని స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా చూస్తున్నారని, అయితే నితీష్ను ఇప్పుడే హార్దిక్తో పోల్చడం సరికాదని మోహిత్ అభిప్రాయపడ్డాడు. నితీష్ బ్యాటింగ్ శైలి హార్దిక్కు భిన్నంగా ఉంటుందని, అతడిపై అంచనాలను తగ్గించుకోవాలని సూచించారు. మరోవైపు, తొలి ఓవర్లోనే వికెట్ తీయగల సామర్థ్యం నితీష్కు ఉందని మాజీ భారత కెప్టెన్ అజింక్య రహానే అన్నారు.