TG: 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా.. 130 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా 2016లో యాసిన్ భత్కల్ సహా మరో ఐదుగురికి ఎన్‌ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో ముద్దాయిలు కిందిస్థాయి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాంబు పేలుళ్ల కేసుపై మంగళవారం తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీనిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.