ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు లోక్‌సభ రహస్యంగా సమావేశం కావడానికి నిబంధనలు అనుమతిస్తాయని రాజ్యాంగ నిపుణుడు వెల్లడించారు. కానీ చరిత్రలో ఇంతవరకూ అలా సమావేశం కాలేదట. 1962లో చైనాతో ఉద్రిక్తతల సమయంలో సభను రహస్యంగా సమావేశపరచాలని కొంతమంది ప్రతిపక్ష సభ్యులు కోరారు. అయితే అప్పటి ప్రధాని నెహ్రూ అంగీకరించలేదు.