ఏపీ మంత్రి గొట్టిపాటికి ఫోన్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి

ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు TG ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోన్ చేసి మాట్లాడారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల పురోగతిపై ఆయన ఆరా తీశారు. సిబ్బంది లేదా సామగ్రి కొరత ఉంటే తెలియజేయాలని భట్టి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన సాయానికైనా సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు. ప్రస్తుతం TG నుండి 1100 మంది విద్యుత్ సిబ్బంది ఏపీలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕