రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ఇండియా కూటమి నేతల భేటీ ముగిసింది. ఎన్నికల్లో ఓట్ల చోరీ జరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై రాష్ట్రపతి ఆధారాలు అడిగారని, వాటిని సేకరించి ఇస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు.