గుజరాత్‌లోని సూరత్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో పనులు చేయకపోవడంపై తండ్రి రమేష్ కైలాష్‌సింగ్ రాజ్‌పుత్ తన కుమార్తె కాజల్‌ను మందలించి, ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కొని నేలకు విసిరికొట్టాడు. ఈ చర్యకు ఆగ్రహించిన కాజల్, ప్రెషర్ కుక్కర్ మూతతో తండ్రి తలపై కొట్టి, అనంతరం కత్తితో పొడిచి హత్య చేసింది. అక్టోబర్ 31వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అమ్రోలి పోలీసులు కాజల్‌ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.