TG: ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హతమార్చిన ఘటన జయశంకర్ భూపాలపల్లి (D) భూపాలపల్లి (M) గొల్లబుద్దారం తండాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చందు (40) అనే వ్యక్తిని భార్య పావని, తన ప్రియుడు దరావత్ సంతోష్‌తో కలిసి గురువారం రాత్రి హత్య చేశారని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని సంచిలో మూటకట్టి సమీప గ్రామం వద్ద రోడ్డు పక్కన పడేశారని వెల్లడించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి పావని, సంతోష్‌లను అదుపులోకి తీసుకున్నారు.