భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం న్యూ గొల్లగూడెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొడుకు మద్యానికి బానిస అవడంతో హత్య చేసింది. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వమని తరచూ వేధిస్తుండడంతో దారుణంగా చంపేసింది. ఏకంగా కాళ్లు కట్టేసి, ఉరివేసి హత్య చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.