72వేల ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి: మంత్రి పొంగులేటి

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నుంచి బిల్లుల చెల్లింపు వరకు ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు. మొదటి విడతలో మంజూరైన 72 వేల ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అక్రమాలు, అవినీతికి తావులేకుండా ల‌బ్ధిదారుల‌కు మేలు చేకూరేలా సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాల‌న్నారు.

தொடர்புடைய செய்தி