మలయాళ నటి, మాజీ జర్నలిస్ట్ రిని ఆన్ జార్జ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో కేరళ పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూతతిల్‌ను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. ఈ ఆరోపణలతో ఆయన యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇటీవలే రాజీనామా చేశారు. అయినప్పటికీ.. పలువురు నేతలు విమర్శలు చేయడంతో పార్టీ క్రమశిక్షణా చర్యగా సస్పెన్షన్ అమలు చేసింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.