TG: హైదరాబాద్‌లోని సీతారాంబాగ్ రామ్ మైదానంలో రావణాసురిడి రూపంలో సీఎం రేవంత్ రెడ్డి కటౌట్‌ను బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేశారు. 22A స్కామ్, HCU ల్యాండ్ స్కామ్, 15% కమిషన్ అంటూ కటౌట్‌పై రాసి దహనం చేసేందుకు యత్నించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ తన అనుచరులతో అక్కడికి చేరుకుని ఆ కటౌట్‌ను తీసేయించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసినట్లు సమాచారం.