ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో సెమీస్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 362/6 స్కోర్ చేసింది. ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్ మిల్లర్ అద్భుత సెంచరీ చేశారు. అయితే వరుసగా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 50 ఓవర్లలో 312/9 రన్స్ మాత్రమే చేసి ఓటమి పాలైంది. కివీస్ 50 పరుగుల తేడాతో విజయాన్ని సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం తుదిపోరులో భారత్‌తో న్యూజిలాండ్ తలపడనుంది.