అత్యాచారానికి గురై హత్యకు గురైన 31 ఏళ్ల కోల్‌కతా వైద్యురాలి మృతదేహం లభ్యమైన 3వ అంతస్తులోని సెమినార్ గదిలో ఆమె ఇద్దరు సహోద్యోగుల వేలిముద్రలను సీబీఐ గుర్తించిందని రిపోర్ట్ లు తెలిపాయి. ఆమె నలుగురు సహోద్యోగుల వాంగ్మూలం పరస్పరం విరుద్ధంగా ఉన్నందున వారికి లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించనున్నారని పేర్కొన్నాయి. సదరు వ్యక్తులు సాక్ష్యాలేమైనా తారుమారు చేశారా? అనే దానిపై సీబీఐ విచారణ జరపనుందని వెల్లడించాయి.