రూ.350 కూలీ డబ్బులు ఇవ్వలేదని దారుణ హత్య

TG: తమిళనాడు నుంచి పొట్టచేతపట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ జిల్లా కేంద్రంలో వెల్డింగ్ పనులు చేసేందుకు తమిళనాడుకు చెందిన ముత్తురాజ్ గణేశన్, పరమశివన్, ధన్‌రాజ్‌లను తన వెంట తీసుకొచ్చాడు. ఒక్కొక్కరికి రోజుకి రూ.1000 కూలీ ఇస్తానన్నాడు. అయితే గత నెల 27న నలుగురు కలిసి అర్ధరాత్రి వరకు మద్యం తాగారు. ఈ క్రమంలో ముత్తురాజ్ చెల్లించే కూలీ డబ్బుల విషయంలో గొడవ జరిగింది. రోజూ రూ.వెయ్యి కూలీ ఇస్తానని చెప్పి అందులో రూ.200 కమీషన్, రూ.150 భోజనం పేరుతో తీసుకుని కేవలం రూ.650 మాత్రమే చెల్లిస్తున్నాడని ముత్తురాజ్‌తో ఘర్షణకు దిగారు. మాటామాటా పెరిగి ముత్తురాజ్‌ను నేలకేసి బలంగా బాదడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕