తెలంగాణలో 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు, పేదలపై జరుగుతున్న వేధింపులను సహించబోమని హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ, భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.