రేపు మేడిగడ్డకు BRS నేతల బృందం

TG: బీఆర్ఎస్ నేతల బృందం శనివారం మేడిగడ్డకు వెళ్లనుంది. గోదావరి జలాల వినియోగంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నాయకులు తరలివెళ్లనున్నారు. ఇప్పటికే 794 టీఎంసీల నీళ్లు కిందికి వదిలేశారని, కాఫర్ డ్యామ్ నిర్మిస్తే ఇప్పటికీ నీళ్లు లిఫ్ట్ చేయొచ్చని సీనియర్ ఇంజనీర్లు చెప్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి సమస్యతో పాటు, రైతులకు కూడా నీళ్లు అందించవచ్చని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నట్లు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕