TG: కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) అధికారులను సోమవారం బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలవనుంది. హైదరాబాద్ తాగునీటి కోసం సాగర్లోని నీటిని రక్షించాలని బీఆర్ఎస్ నేతలు కోరనున్నారు. అలాగే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలపనున్నారు.