మహాపాదయాత్ర ప్రాంతం మార్చే యోచనలో బీజేపీ

TG: హైదరాబాద్‌లో బీజేపీ ఈ నెల 2న చేపట్టనున్న మహాపాదయాత్ర ప్రాంతం మార్చే యోచనలో ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా పాల్గొననుండటంతో ట్యాంక్‌బండ్ కాకుండా మరోచోటకు మార్చాలని భావిస్తోంది. పాదయాత్ర అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. బహిరంగ సభ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానాన్ని ఆ పార్టీ నేతలు పరిశీలించారు. ఎస్ఐఆర్‌పై ఇండీ కూటమి ప్రచారాన్ని నిరసిస్తూ బీజేపీ ఈ పాదయాత్ర చేయనుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕