ఓట్ల కోసం బీజేపీ ఎంతకైన తెగిస్తుందని, దేశాన్ని విడగొట్టడానికి కూడా వెనకాడదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న లింగమంతుల జాతరలో పాల్గొన్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కానీ తమ ప్రభుత్వం సెక్యూలర్ విధానాన్ని పాటిస్తుందని, అన్ని మతాలను గౌరవిస్తుందని పేర్కొన్నారు.