దానిమ్మ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్లతో వేగంగా పోరాడతాయి. శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. దానిమ్మ తొక్కల రసాన్ని సేవిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ తొక్కలో ఉండే కొల్లాజెన్ చర్మ విచ్ఛిన్నతను తొలగించి.. ముడతలు పడకుండా చేస్తుంది. అలాగే మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలతో పోరాడుతుంది. దానిమ్మ తొక్కలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు బ్యాక్టీరియా, ఇతర ఇన్ ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి.