టాంజానియాలోని దార్ ఎస్ సలాం నగరంలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ్ సదన్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. భారత హైకమిషనర్ బిశ్వదీప్ దే జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు. విదేశాల్లో మన సంస్కృతిని కాపాడుతున్నందుకు నిర్వాహకులను పలువురు అభినందించారు.