హోటల్ గదిలో అస్సాం విజిలెన్స్ డీఎస్పీ మృతి

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కార్యాలయంలోని విజిలెన్స్‌ సెల్‌కు చెందిన డీఎస్పీ ఖర్గేశ్వర్‌ రాభా హోటల్‌ గదిలో మృతిచెందారు. అక్టోబర్‌ 18న బోంగైగావ్‌లోని జాహ్నవి రీజెన్సీ హోటల్‌లో ఆయన బస చేశారు. గది నుంచి ఆయన బయటకు రాకపోవడం, లోపలి నుంచి దుర్వాసన రావడంతో హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా, కుళ్లిన స్థితిలో ఆయన మృతదేహం కనిపించింది. ఫోరెన్సిక్‌ బృందం ఆధారాలు సేకరించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యంతో ఆయన మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నప్పటికీ, మృతికి ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி

✕
✕