వచ్చే ఏడాది బంగ్లాదేశ్లో జరగనున్న ఆసియా కప్ 2027 టోర్నీకి నేపాల్ క్రికెట్ జట్టు అర్హత సాధించింది. మలేషియాలో జరిగిన ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ 2026 ఫైనల్లో యూఏఈని ఓడించి ఈ ఘనత సాధించింది. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీకి భారత జట్టుతో పాటు పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్ జట్లు నేరుగా ప్రవేశం పొందాయి. నేపాల్ ఓపెనర్ ఆసిఫ్ షేక్ సెంచరీతో రాణించాడు. 2023 తర్వాత నేపాల్ జట్టు ఆసియా కప్కు అర్హత సాధించడం ఇది రెండోసారి.