టీ20ల్లో రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్

టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడం ద్వారా ఈ ఏడాది 38 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. గతంలో 37 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న రికార్డును అర్ష్‌దీప్ అధిగమించాడు. ఇక, అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచేందుకు అర్ష్‌దీప్ మరో రెండు వికెట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕