నవంబర్ 13 నుంచి 24 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

TG: హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో నవంబర్ 13 నుంచి 24 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. అగ్నివీర్‌గా ఆర్మీలో చేరేందుకు అన్ని జిల్లాల వారికి అవకాశం కల్పించారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు. అడ్మిట్ కార్డులు ఉన్నవారు ఒరిజినల్ డాక్యుమెంట్లతో రావాలని అధికారులు సూచించారు. సందేహాలుంటే 040-27740059 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు. 
వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

தொடர்புடைய செய்தி

✕
✕