AP: బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం, రేపటికి వాయుగుండంగా బలపడనుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం కారణంగా, ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని, దీనిపై ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టత రానుందని నిపుణులు తెలిపారు. ఇదిలా ఉండగా, గతంలో వచ్చిన అర్నబ్ తుఫాను ఒడిశా వైపు పయనించి, అల్పపీడనంగా బలహీనపడింది.