AP: పోలవరం జిల్లాలో తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, పాపికొండల విహారయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. రంపచోడవరం సబ్‌కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల మేరకు, సోమవారం నుంచి 16 టూరిజం బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దసరా సెలవుల సందర్భంగా రెండు వారాల క్రితమే పునఃప్రారంభమైన ఈ యాత్ర, వాతావరణ పరిస్థితుల రీత్యా మళ్లీ నిలిచిపోయింది. గతంలో గోదావరి వరదల కారణంగా సుమారు 70 రోజుల పాటు ఈ విహారయాత్ర నిలిచిపోయిన విషయం పాఠకులకు తెలిసిందే.