AP: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ప్రకాశ్, కావ్య దంపతులు నిడమానూరులో నివసిస్తుంటారు. కావ్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయాగా పని చేసే సమయంలో వాసు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొంతకాలం వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం, కలుసుకోవడం జరిగింది. ఈ విషయం భర్త ప్రకాశ్‌కు తెలియడంతో కావ్యను మందలించి ఉద్యోగం మాన్పించారు. కావ్య ఇంట్లో ఉన్నప్పుడు వాసు ఇంటికి వెళ్లి ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.