పెండింగ్ ఈ-చలాన్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ SMS, సోషల్ మీడియా మెసేజ్‌ల ద్వారా ప్రజలను మోసగిస్తున్నారని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, ఎలాంటి APK ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని స్పష్టం చేశారు. ఈ-చలాన్ వివరాలను కేవలం అధికారిక వెబ్సైట్ echallan.parivahan.gov.in ద్వారా మాత్రమే తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే, బాధితులు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.