ఎయిరిండియా నష్టాలు రెట్టింపు.. రూ. 22,238 కోట్లకు చేరిక

గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ఎయిరిండియా నష్టాలు రూ.10,859 కోట్ల నుంచి రూ.22,238 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.78,636 కోట్ల నుంచి రూ.71,870 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ.89,317 కోట్ల నుంచి రూ.93,733 కోట్లకు చేరాయి. విదేశీ మారకానికి సంబంధించిన నష్టాలు రూ.1,545 కోట్ల నుంచి రూ.7,388 కోట్లకు పెరిగాయి. విమానాల మరమ్మతులు, నిర్వహణ వ్యయాలు పెరగ్గా, ఇంధన వ్యయాలు తగ్గాయి.

தொடர்புடைய செய்தி

✕
✕