కాగజ్‌నగర్ పట్టణంలో మెయిన్ మార్కెట్ లో నూతనంగా నిర్మాణంలో ఉన్న భవనం గోడ ఆదివారం ఒక్కసారిగా కూలడంతో ద్విచక్ర వాహనం, సైకిల్ ద్వంసం అయ్యింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవ్వరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సింగల్ ఇటుకలతో ఈ బిల్డింగ్ పరద కట్టడం వలన ఇది వరకే వెనుక వైపున ఉన్న గోడ కూలిపోయింది. మళ్లీ ఇవాళ గోడ కూలడంతో అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.