కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రూరల్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి 13 వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న పశువులను నైట్ పెట్రోలింగ్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. సరైన ధృవపత్రాలు లేని కారణంగా స్తానిక టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఉదయం కేసులు నమోదు చేసి స్థానిక త్రిశూల్ పహాడ్ పై ఉన్న గోశాలకు పశువులను తరలించినట్లు టౌన్ సీఐ పీ. రాజేంద్రప్రసాద్ తెలిపారు.