ఆసిఫాబాద్: కొడుకు మృతదేహాన్ని నదిలో పడేసిన తండ్రి

కుమారుని మృతదేహాన్ని కన్న తండ్రే నదిలో పడేసిన ఘటన సిర్పూర్ మండలంలో చోటు చేసుకుంది. టోంకినికి చెందిన జయేందర్ మృతదేహం నదిలో దొరికిన విషయం తెలిసిందే. ఎస్ఐ కమలాకర్ మాట్లాడుతూ.. గత బుధవారం తండ్రీ కొడుకులు పొలానికి వెళ్లగా కరెంట్ షాక్ తగిలి జయేందర్ మృతి చెందాడు. గమనించిన తండ్రి తన మీదికి వస్తుందనే భయంతో పక్క పొలం యజమాని చెలిరాజ్ సాయంతో మృతదేహాన్ని రాయికి కట్టి నదిలో పడేసినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி