కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కాపువాడలో చైన్ స్నాచర్స్ కలకలం రేపింది. మంగళవారం ఉదయం ఇంటి బయట ముగ్గు వేస్తున్న ఓ మహిళ మెడలోని బంగారు చైన్ ను ఇద్దరు దుండగులు లాక్కుని వెళ్ళారు. ముందుగా మహిళను పూలు కోసుకుంటామని అడిగి పూలు తెంపుతున్నట్టు చేసి ఒక్కసారిగా మెడలోని గొలుసును లాక్కుని పారిపోయారని మహిళ తెలిపారు. గత రెండు రోజులుగా ఇద్దరు తిరుగుతున్నారని ఆమె అన్నారు.